టెహ్రాన్: ఒమన్ గల్ఫ్ లో జరిపిన మిస్సైల్ టెస్ట్ లో ఇరాన్ తన స్వంత నౌకనే పేల్చివేసింది. ఈ ఘటనలో 19 మంది నేవీ సిబ్బంది చనిపోయినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఫ్రిగేట్ జమరన్.. ఆదివారం యాంటీ షిప్ మిస్సైల్ టెస్ట్ నిర్వహించింది. అయితే ఆ మిస్సైల్ టార్గెట్ మిస్సయి.. పొరపాటున కొనరాక్ అనే మరొక షిప్ ను తాకిందని పేర్కొంది. ఫ్రిగేట్‌ను వదిలిన నేవీ సిబ్బంది.. ఆ ప్రమాదాన్ని నిలువరించలేకపోయారని, మిస్సైల్ రూట్ ను డైవర్ట్ చేయలేకపోయారని మీడియా తెలిపింది. అయితే.. ఇరాన్ ప్రభుత్వం మాత్రం .. ఈ ప్రమాదంలో ఒక్కరే చనిపోయారని, పలువురికి గాయాలయ్యాయని చెప్తోంది. పర్షియన్ గల్ఫ్ లోని హర్ముజ్ జలసంధి వద్ద ఈ ఘటన జరిగింది.
