మమ్మల్నే బెదిరిస్తవా.. ఇక మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవు: చర్చలను తిరస్కరించిన ఇరాన్

మమ్మల్నే బెదిరిస్తవా.. ఇక మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవు: చర్చలను తిరస్కరించిన ఇరాన్

టెహ్రాన్: అమెరికా, ఇరాన్ వార్ ఎపిసోడ్ మళ్లీ మొదటికి వచ్చింది. చర్చలు జరుగుతున్నాయి.. ఒప్పందం కుదురుతుంది.. యుద్ధం ఆగబోతుంది అనుకున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గడువు ముగిసే లోగా హార్మూజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ మొత్తం అంతమైపోతుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. 

ఒకవైపు శాంతి చర్చలు అంటూనే.. మరోవైపు ఇరాన్ మొత్తం అంతమైపోతుందని బెదిరించడం ఏంటని ట్రంప్ తీరుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేసింది. అమెరికాతో అన్ని దౌత్య, పరోక్ష సంప్రదింపుల మార్గాలను తక్షణమే మూసివేసినట్లు మంగళవారం (ఏప్రిల్ 7) ఇరాన్ ప్రకటించింది. అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని.. అమెరికా తీసుకున్న ఎలాంటి చర్యలకైనా ప్రతీచర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. 

తగ్గేదే లేదు.. చూసుకుందాం: ఇరాన్

ఈ రాత్రికి మొత్తం ఇరాన్ నాగరికత అంతమైపోతుందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్‎కు ఇరాన్ అదే రీతిలో కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ ఏ మాత్రం తలొగ్గదని.. ఎక్కడికైతే అక్కడికి చూస్కుందామని తేల్చి చెప్పింది. యుద్ధంలో కొత్త దశాదిశ మొదలైందని.. ఫతేహ్‌, ఖేబర్‌ షేకన్‌ వంటి అధునాతన మిస్సైళ్లతో ఇకపై దాడులను రెట్టింపు చేస్తామని హెచ్చరించింది. వరుస బెదిరింపులకు దిగుతున్న ట్రంప్‎ను వైట్ హౌస్ నియంతగా అభివర్ణించింది ఇరాన్.

అమెరికా సైన్యం హద్దులు దాటితే మా ప్రతిస్పందన మిడిల్ ఈస్ట్ కూడా దాటుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు మేం పౌరయేతర లక్ష్యాలపై దాడులు చేయలేదు.. చేయబోం. కానీ ఇరాన్‎లో పబ్లిక్ సెక్టార్లపై జరుగుతోన్న దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఏ మాత్రం వెనకాడబోమని హెచ్చరించింది. తమపై దాడులు ఇలాగే కొనసాగితే భవిష్యత్‎లో అమెరికా, దాని మిత్రదేశాలకు చమురు, గ్యాస్‌ అందకుండా ఆయా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుంటామని బెదిరించింది.

పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం ఇప్పటికే వరకు ఎంతో సంయమనం పాటించామని.. కానీ ఇప్పడు తమకు ఎలాంటి పరిమితులు లేవని ప్రతీకార చర్యలు ఊహించని విధంగా ఉంటాయని హెచ్చరించింది. చర్చలు అంటూనే ఇరాన్ నాగరికత మొత్తం అంతమై పోతుందన్న ట్రంప్ బెదిరింపులకు దిగడం ఏ మాత్రం సమంజసం కాదని.. ఇక అమెరికాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చలు నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. 

ట్రంప్ ఏమన్నారంటే..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. హర్మూజ్ జల సంధి తెరవకపోతే.. ఏం జరుగుతుందో చెప్పేశాడు. ట్రంప్ మాటల్లోనే.. ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. ఇరాన్ దేశాన్ని మళ్లీ పున:నిర్మించలేరు. అలా జరగాలని నేను కోరుకోవటం లేదు. అయినా అదే జరుగుతుంది అంటూ ట్రూత్ పోస్టులో తన స్టాంగ్ ఏంటో స్పష్టంగా చెప్పారు ట్రంప్.

 హర్మూజ్ ఓపెన్ కాకపోతే.. ఈ రాత్రికి ఇరాన్ దేశంలో నాగరికత అంతం అవుతుంది అంటూ ఫైనల్ గా స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ఇరాన్ పాలనలో ఇప్పుడు మార్పు వచ్చింది. భిన్నమైన, తెలివైన, తీవ్రవాద భావజాలం తక్కువగా ఉన్న మనుషులు విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే అద్భుతమైనది ఏమైనా జరగొచ్చు.. ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ కామెంట్ చేశారు ట్రంప్.