యాంకర్​ ఇన్వెస్టర్ల నుంచి ఇరెడాకు రూ. 643 కోట్లు

యాంకర్​ ఇన్వెస్టర్ల నుంచి ఇరెడాకు రూ. 643 కోట్లు

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్​ రెన్యువబుల్​ ఎనర్జీ డెవలప్​మెంట్​ ఏజన్సీ (ఇరెడా) యాంకర్​ ఇన్వెస్టర్ల నుంచి రూ. 643 కోట్లు సమీకరించింది. 58 ఫండ్స్​కు ఒక్కో షేర్​కు రూ. 32 చొప్పున 20.10 కోట్ల షేర్లను ఇరెడా జారీ చేసింది. అంటే, ఐపీఓ అప్పర్​ ప్రైస్​బ్యాండ్​ దగ్గరే ఈ షేర్లను జారీ చేసినట్లు. షేర్లు తీసుకున్న యాంకర్​ ఇన్వెస్టర్ల జాబితాలో గోల్డ్​మన్​ శాచ్స్​, ఇంటిగ్రేటెడ్​ కోర్​ స్ట్రేటజీస్​, సొసైటీ జనరాలి, గ్యామ్​ స్టార్​ ఎమర్జింగ్​ ఈక్విటీ, బీఎన్​పీ పరిబస్​ ఆర్బిట్రేజ్​ వంటివి ఉన్నాయి. అంతేకాదు, యాంకర్​ బుక్​లో హెచ్​డీఎఫ్​సీ మ్యూచువల్​ ఫండ్​, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్​ , ఎస్​బీఐ మ్యూచువల్​ ఫండ్

కోటక్​ మ్యూచువల్​ ఫండ్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, ఎస్​బీఐ జనరల్​ ఇన్సూరెన్స్​ వంటివి కూడా పాల్గొన్నాయి. ఇరెడా తొలి ఐపీఓ మంగళవారం మొదలయింది. రూ. 30 – రూ.32 ధర వద్ద ఇరెడా ఐపీఓ చేస్తోంది. ఈ నెల 23 దాకా ఐపీఓ ఓపెన్​లో ఉంటుంది. రూ. 1,290 కోట్ల సేకరణ కోసం 40.31 కోట్ల తాజా షేర్లను ఇరెడా జారీ చేయనుంది.   గవర్నమెంట్​ తన వాటాలో 26.88 కోట్ల షేర్లను ఐపీఓలో ఆఫర్​ ఫర్​ సేల్​ కోసం ఉంచుతోంది.