జెన్సోల్‌‌‌‌ నుంచి అప్పు వసూలు చేసేందుకు ట్రిబ్యునల్‌‌‌‌కు ఐఆర్‌‌‌‌‌‌‌‌ఈడీఏ

జెన్సోల్‌‌‌‌ నుంచి అప్పు వసూలు చేసేందుకు ట్రిబ్యునల్‌‌‌‌కు ఐఆర్‌‌‌‌‌‌‌‌ఈడీఏ

న్యూఢిల్లీ:  ప్రభుత్వ కంపెనీ  ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌‌‌‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌‌‌‌‌‌‌‌ఈడీఏ),  జెన్సోల్ ఇంజనీరింగ్,  జెన్సోల్ ఈవీ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సుమారు రూ.729 కోట్ల అప్పును రికవరీ చేసుకునేందుకు బుధవారం (May 21)ఢిల్లీలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్‌‌‌‌ను ఆశ్రయించింది.

  జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ నుంచి రూ.510.00 కోట్లు,  జెన్సోల్ ఈవీ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.218.95 కోట్లు  వసూలు కావాలి. దీనికంటే ముందు ఈ రెండు కంపెనీలపై  దివాలా అప్లికేషన్ కూడా దాఖలు చేసింది.  ఫండ్స్‌‌‌‌ను దారి మళ్లించినందుకు,  కంపెనీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో లోపాలు ఉన్నాయని జెన్సోల్ ఇంజనీరింగ్  ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీలను సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి తాత్కాలికంగా నిషేధిస్తూ కిందటి నెలలో సెబీ ఆదేశాలు ఇచ్చింది.

ఆ తర్వాత  జగ్గీ సోదరులు కంపెనీ నుంచి రాజీనామా చేశారు. అన్మోల్ సింగ్ జగ్గీ ఎండీ పదవిలో, పునీత్ సింగ్ జగ్గీ హోల్-టైమ్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేశారు.