జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట్ కార్పొరేషన్ లోని ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ శాఖలలో పాటు కమిషనర్ అక్రమాలపై విచారణ జరపాలని నిజాంపేట్ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆకుల సతీశ్ జిల్లా కలెక్టర్కు బుధవారం ఫిర్యాదు చేశాడు.
జీహెచ్ఎంసీ లో విలీనం తరువాత నిజాంపేట్ కార్పొరేషన్లో అవినీతి కార్యక్రమాలు ఎక్కవగా జరుగుతున్నాయని ఆరోపించారు. పలు శాఖల అధికారులు అర్ధరాత్రి వరకూ కార్యాలయంలో ఉండి రూల్స్‌కు విరుద్ధంగా పనులు చేస్తున్నారని చెప్పారు. విలీనం తరువాత జరిగిన లావాదేవీలను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.
