
జనగామ జిల్లా : మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఇరిగేషన్ డిపార్టమెంట్ కు చెందిన ఓ ఆఫీసర్. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జనగామ జిల్లాలో జరిగింది. ఇరిగేషన్ డిపార్టమెంట్ డీఈ రవీందర్ రెడ్డి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా పక్కా ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు.. శనివారం లంచం తీసుకుంటుండగా రవీందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.