ఇరిగేషన్ శాఖ పేరు మార్చిన కేసీఆర్

ఇరిగేషన్ శాఖ పేరు మార్చిన కేసీఆర్

ఇక నుంచి వాటర్ రిసోర్సెస్ డిపార్ట్ మెంట్
శాఖ పేరు మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం
ఎన్ని ఈఎన్సీ పోస్టులు అవసరమో తేల్చండి
అవసరమైతే మరో 1000 పోస్టులు మంజూరు చేస్తాం

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ నుంచి కొనసాగుతున్న ఇరిగేషన్ శాఖ పేరు మారనుంది. ఇరిగేషన్ శాఖ ఇకపై వాటర్ రీసోర్సెస్ డిపార్ట్ మెంట్ గా కొనసాగుతుందని, ఈ మేరకు పేరు మారుస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం ప్రగతి భవన్ లో ఇరిగేషన్ రీ ఆర్గనైజేషన్ పై మంత్రులు, అధికారులు, ఇంజనీర్లతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీటిని ఇవ్వడానికి రోజుకు గోదావరి నుంచి 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని సీఎం స్పష్టం చేశారు. రీఆర్గనైజేషన్ తర్వాత మేజర్, మీడియం, మైనర్, ఐడీసీ లాంటి వ్యవస్థలన్నీఒకే గొడుగు కిందికి వస్తాయని, ఒక జోన్ కు ఒక్కో సీఈ ఇన్ చార్జీగా వ్యవహరిస్తారని చెప్పారు. మేజర్ ప్రాజెక్టులు మొదలు.. చెరువులు, చెక్ డ్యాంలు, లిఫ్టులన్నీ ఉంటాయన్నారు.

ఖర్చులను అంచనా వేయండి..
ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు కచ్చితమైన ఆపరేషన్ మ్యానువల్స్ ఉండాలని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కు ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాలన్నారు. అన్ని పంపుహౌస్ ల మెయింటెనెన్స్ బాధ్యతను విద్యుత్ శాఖకు అప్పగించాలని ఆదేశించారు. ఉపాధి హామీ కింద చేసేందుకు వీలున్న పనులను గుర్తించి, ప్లాన్లు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్ రావు, అనిల్ కుమార్, హరిరాం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అన్ని శాఖలూ ఒకే చోటుకు..
వాటర్ రీసోర్సెస్ డిపార్ట్మెంట్ కు ఎన్ని ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) పోస్టులు అవసరమో ముందుగా
నిర్ణయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈఎన్సీ జనరల్, అడ్మినిస్ట్రేషన్ , ఆపరేషన్స్ పోస్టులు
కొనసాగుతాయని చెప్పారు. వాటికి అదనంగా ఇంకా ఈఎన్సీ పోస్టులు అవసరమైతే చెప్పాలన్నారు.
ఇరిగేషన్ లో వేర్వేరువిభాగాలుగా ఉన్న అన్ని శాఖలను ఒకే చోటుకు చేర్చాలని ఆదేశించారు. ఈఈలు,
డీఈల పరిధిని నిర్ణయించి, ప్రపోజల్స్ ఇవ్వాలన్నారు. ఈఎన్సీ నుంచి లష్కర్ వరకు డిపార్ట్ మెంట్ లో
ఎంత మంది ఉన్నారు? ఇంకా ఎన్ని పోస్టులు అవసరం అనేది నిర్ణయించాలని, అవసరమైతే డిపార్ట్
మెంట్ కు ఇంకో 1000 పోస్టులు కొత్తగా మంజూరుచేస్తామని సీఎం చెప్పారు.

For More News..

నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్.. ఇద్దరికి వ్యాక్సిన్

ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ వ్యాక్సిన్ సేఫ్‌.. ఫేజ్ 1 ట్రయల్స్ సక్సెస్

సెక్రటేరియట్ కూల్చివేత కవరేజీకి అనుమతివ్వండి