ఇరిగేషన్ ప్రాజెక్టులకు పోటెత్తిన వరద

ఇరిగేషన్ ప్రాజెక్టులకు పోటెత్తిన వరద

ఎగువ కురుస్తున్న వర్షాలతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 3లక్షల 10వేలు, ఔట్ ఫ్లో 3లక్షల 12వేల 977 క్యూసెక్కులుగా ఉంది.  

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టుకు 3 లక్షల 94 వేల 52 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. 10 గేట్లు 15 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఔట్ ఫ్లో 4 లక్షల 38 వేల 762 క్యూసెక్కులు గా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుతం 884.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.438 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 26 గేట్లను 10 ఫీట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ ఇన్ ఫ్లో4 లక్షల 38 వేల 762 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో3 లక్షల 69 వేల 847క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 586 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 300.3200 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది.  ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 5వే ల666 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తోంది. ఔట్ ఫ్లో 10వేల 260 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 692.500 అడుగులుగా ఉంది.