
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో తన కెరీర్ లోనే అత్యంత బిజీ షెడ్యూల్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం 'ది రాజా సాబ్', ' స్పిరిట్ ' వంటి భారీ ప్రాజెక్టులతో పాటు, బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టిన 'కల్కి 2898 AD' సినిమా సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సీక్వెల్ నుంచి కథానాయిక దీపికా పడుకొణె తప్పుకోవడంతో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వార్తతో, ఆమె స్థానంలో ప్రభాస్ సరసన నటించే నటి ఎవరు అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
దీపికా ఎందుకు తప్పుకున్నారు?
దీపికా పడుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి రెండు ప్రధాన కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఆమె రెమ్యునరేషన్ డిమాండ్స్. ఈ సినిమా కోసం ఆమె భారీ మొత్తంలో పారితోషికం అడిగారని, అది కుదరకపోవడంతోనే మూవీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మొదటి భాగానికి తీసుకున్న రెమ్యునరేషన్ కంటే 25 శాతం ఎక్కువ పారితోషికాన్ని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆమె ప్రతి రోజు కేవలం 7 గంటలు మాత్రమే షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొంటానని పట్టుబట్టింది. అంతే కాకుదు తన 25 మంది సిబ్బంది కోసం 5-స్టార్ హోటల్స్ కావాలని కూడా ఆమె డిమాండ్ చేసిందనన్న టాక్ వినిపిపిస్తోంది. ఇలా ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చలేక దీపికాను మూవీ మేకర్స్ పక్కన పెట్టినట్లు సమాచారం.
అనుష్క శెట్టికి ఛాన్స్ ఉందా?
దీపికా పడుకొణె స్థానంలో ఏ హీరోయిన్‌ను తీసుకుంటారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎక్కువ మంది అభిమానులు అనుష్క శెట్టి పేరును సూచిస్తున్నారు. 'బాహుబలి పార్ట్ 1' , 'బాహుబలి పార్ట్ 2' చిత్రాలలో ప్రభాస్‌తో కలిసి నటించింది అనుష్క. వారిద్దరి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఈ జంట తెరపై కనిపిస్తే సినిమాకు మరింత హైప్ వస్తుంది. ఇది 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌కు ఒక అదనపు ఆకర్షణ అవుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 'బాహుబలి' తర్వాత మళ్లీ ఈ జంటను చూడాలని ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇది నిజమైతే, అభిమానులకు అది ఒక పండుగే అవుతుంది.
'స్పిరిట్' నుంచి నిష్క్రమణ
దీపికా పడుకొణె ఒక ప్రభాస్ చిత్రం నుంచి బయటికి రావడం ఇది రెండోసారి గత మేలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' చిత్రం నుంచి ఆమెను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఆ చిత్రానికి ఆమె రూ. 20 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందని, 8 గంటల షిఫ్ట్, లాభాల్లో వాటా కోరిందంట. దీంతో ఆ చిత్ర నిర్మాతలు నటి త్రిప్తి డిమ్రిని కథానాయికగా ప్రకటించారు. అప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకూడా జరిగింది.
మూవీ మేకర్స్ స్పందన కోసం ఎదురుచూపులు
'కల్కి 2898 AD' మేకర్స్, దర్శకుడు నాగ్ అశ్విన్, ఈ విషయంపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అభిమానులు మాత్రం ప్రభాస్ సరసన నటించే ఆ తర్వాతి హీరోయిన్ ఎవరనే దానిపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అనుష్క శెట్టికి అవకాశం వస్తే, 'కల్కి' సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద మరో రికార్డు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపికా స్థానంలో ఎవరు వస్తారనే దానిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. తెలుగు సినిమా చరిత్రలోనే భారీ విజయం సాధించిన చిత్రంగా 'కల్కి' నిలిచింది. ఇప్పుడు సీక్వెల్‌తో ఎలాంటి అంచనాలను నెలకొల్పుతుందో చూడాలి.