విశాఖ ఉక్కుపై మాట్లాడొద్దా? ఏపీ ఈ దేశంలో లేదా?: కేటీఆర్‌‌‌‌‌‌‌‌

విశాఖ ఉక్కుపై మాట్లాడొద్దా? ఏపీ ఈ దేశంలో లేదా?: కేటీఆర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ‘విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నరు. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడితే కొందరు అబ్జెక్షన్ చెబుతున్నరు. విశాఖ ఉక్కు సంగతి నీకెందుకు? ఏపీ సంగతులతో నీకేం పని అంటున్నరు. ఏపీ ఈ దేశంలో లేదా? మేం మాట్లా డొద్దా? ఈ దేశంలో మాకు భాగస్వామ్యం లేదా? మాకు నోరు లేదా?’ అని ఐటీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హరిత ప్లాజాలో జరిగిన తెలంగాణ వికాస సమితి ఆత్మీయ సమ్మేళనానికి ఆయన చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌గా హాజరై మాట్లాడారు. ‘ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. సింగరేణి, బీహెచ్‌‌‌‌‌‌‌‌ఈఎల్‌‌‌‌‌‌‌‌ను ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం’ అని హెచ్చరించారు. ఏపీలో సంగతి తమకెందుకని నోరు మూసుకుని కూర్చోలేమని, రేప్పొద్దున తెలంగాణకు కష్టమొస్తే తమ వెంట ఎవరుంటారని అడిగారు. 

ముందు నిజాం షుగర్స్‌‌‌‌ తెరవాలె
తర్వాత వైజాగ్ స్టీల్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌పై మాట్లాడాలె: కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కేసీఆర్ కుటుంబం మాట్లాడాలని కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. నిజాం షుగర్స్‌‌‌‌ను తెరుస్తామని 2014 మేనిఫెస్టోలో టీఆర్ఎస్ చెప్పిందని గుర్తు చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా ఫ్యాక్టరీని ఎందుకు తెరవలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎన్నికలు వచ్చినప్పుడు కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు పూనకం వస్తుందని, ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకోవడానికి కేంద్రాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. 70 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తామన్నా ఉద్యోగులు, టీచర్లు టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓటేయరని చెప్పారు. భైంసా ఘటనకు టీఆర్ఎస్, ఎంఐఎంలే కారణమని.. ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు. త్వరలో భైంసాలో పర్యటిస్తానని కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు.''