బాలీవుడ్ స్టార్ దీపిక పదుకొణె మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో భాగమవబోతోంది. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన అంతర్జాతీయ సిరీస్ ‘ది వైట్ లోటస్’లో ఆమె కీలకపాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. ఈ అమెరికన్ బ్లాక్ కామెడీ డ్రామా ఆంథాలజీ ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకోగా, నాలుగో సీజన్ త్వరలో సెట్స్‌కు వెళ్లబోతోంది. నిజానికి ఈ సిరీస్ మూడో సీజన్‌లోనే దీపిక నటించాల్సి ఉంది.
అయితే అప్పట్లో ప్రెగ్నెన్సీ కారణంగా దీపిక నటించడం కుదరలేదు. దీంతో ఇప్పుడు నాలుగో సీజన్ కోసం సంప్రదించినట్టు
తెలుస్తోంది. త్వరలో ఫ్రాన్స్‌లోని సెయింట్ ట్రోపెజ్ లాంటి ప్రైమరీ లొకేషన్స్‌లో షూటింగ్ చేయబోతున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది విడుదల కానుంది.
గతంలో విన్ డీజిల్ సరసన ‘xXx: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ చిత్రంతో దీపిక హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌తో పాటు షారుక్ ఖాన్‌కు జంటగా ‘కింగ్’లో ఆమె నటిస్తోంది.
