మస్క్ రోజూ 20 డ్రగ్ పిల్స్ వాడాడంటూ న్యూయార్క్ టైమ్స్ కథనం.. ఎలాన్ మస్క్ ఏమన్నాడు

మస్క్ రోజూ 20 డ్రగ్ పిల్స్ వాడాడంటూ న్యూయార్క్ టైమ్స్ కథనం.. ఎలాన్ మస్క్ ఏమన్నాడు

ప్రస్తుతం ఎలాన్ మస్క్ టైమ్ అస్సలు బాలేదు. ఒకపక్క టెస్లా ఆదాయాలు భారీగా పడిపోవటం, ఇటీవల స్పేసెక్స్ రాకెట్ పేలిపోవటం.. అతని వ్యాపారాలపై డోజీకి వ్యతిరేకంగా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక ఉద్యోగిగా డోజీకి హెడ్ బాధ్యతల నుంచి రాజీనామా చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. అయితే దీనిపై ట్రంప్ కూడా స్పందిస్తూ మస్క్ ఎక్కడ ఉన్నా తనవాడే అన్నట్లుగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 

అయితే ఈ క్రమంలో అమెరికాలోని ప్రఖ్యాత వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఎలాన్ మస్క్ డ్రగ్స్ వినియోగించాడని, తనతో పాటు ఒక బాక్సులో వాటిని తీసుకెళ్లేవాడని, రోజూ 20 పిల్స్ తీసుకునేవాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ట్రంప్ కోసం పనిచేస్తూ కెటమిన్ అనే మాదక ద్రవ్యాన్ని వినియోగించాడంటూ నివేదించింది. ట్రంప్ కోసం ఎన్నికల సమయంలో 275 మిలియన్ డాలర్లు డొనేట్ చేసిన తర్వాతి నుంచి మస్క్ డ్రగ్స్ వినియోగం భారీగా పెరిగిందని నివేదించింది. తన అలవాటు కారణంగా బ్రాడర్ సమస్యలు వస్తాయని మస్క్ తన సహచరులకు చెప్పినట్లు పేర్కొంది. 

2018లో మస్క్ ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ గంజాయి తాగటం పెద్ద వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎలాన్ మస్క్ మార్చి 2024లోనే జర్నలిస్ట్ డాన్ లెమన్ కి బదులిచ్చారు. ఎక్కువగా కెటమిన్ స్వీకరిస్తే పనులు చేయటం కుదరదని, అయితే తనకు చాలా పని ఉందంటూ వ్యంగ్యంగా బదులిచ్చాడు. అయితే దీనిపై వైట్ హౌస్ కామెంట్ చేసేందుకు నిరాకరించింది. అయితే ప్రస్తుతం స్పేస్ ఎక్స్ నో డ్రగ్ పాలసీని కఠినంగా అమలు చేస్తోందని వెల్లడైంది.