Google Pay ద్వారా మొబైల్ రీచార్జ్ చేస్తున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..

Google Pay ద్వారా మొబైల్ రీచార్జ్ చేస్తున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..

Google Pay ఇప్పుడు UPI సేవల ద్వారా మొబైల్ రీఛార్జ్ లపై రూ. 3 వరకు కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తోంది. ఈ రుసుము UPI , కార్డు లావాదేవీలు రెండింటికి వర్తిస్తుంది. Google Pay ద్వారా కొనుగోలు చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది. అయితే ఈ ఛార్జీలను ప్రవేశపెట్టినప్పటికీ Google Pay దానిపై అధికార ప్రకటన చేయలేదు. కస్టమర్ ఆన్ లైన్ లో స్ర్కీన్ షాట్ ను షేర్ చేసినప్పుడు ఛార్జీలు పడుతున్నట్లు గమనించారు. ఇప్పటికే Paytm, Phonepe వంటి ఇతర చెల్లింపు ప్లాట్ ఫారమ్ లు కూడా ఈ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. 

భారత్ లో Google తన సేవా నిబంధనలను అప్ డేట్ చేసింది. రూ. 100 నుంచి రూ. 200 మధ్య ఉండే ప్లాన్లకు రూ. 2 ఖర్చవుతుందని.. రూ. 200 నుంచి రూ. 300 మధ్య ఉండే ప్లాన్లకు రూ. 3 కన్వీనియన్స్ రుసుము విధించబడుతుందని Google Pay  స్పష్టం చేసింది.