బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘క్రిష్ 4’ చుట్టూ సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ బడ్జెట్ విషయంలో హృతిక్‌కు, యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) అధినేత ఆదిత్య చోప్రాకు మధ్య పెద్ద గొడవైందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు సినిమా కూడా ఆగిపోయిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ సినిమాతో హృతిక్ డైరెక్టర్‌గా మారుతుండటంతో, వరల్డ్ క్లాస్ VFX కోసం ఏకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ అడిగాడని.. కానీ ఆదిత్య చోప్రా మాత్రం రూ. 350 కోట్లకు మించి పెట్టలేనని అనడంతో ప్రాజెక్ట్ అటకెక్కిందని జోరుగా ప్రచారం జరుగుతుంది.
అయితే లేటెస్ట్ గా ఈ రూమర్లపై హృతిక్ తండ్రి, సీనియర్ డైరెక్టర్ రాకేశ్ రోషన్ స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ బడ్జెట్ వార్తలన్నీ ముమ్మాటికీ అబద్ధాలని కొట్టిపారేశారు. రూ. 500 కోట్ల బడ్జెట్ అంటూ వస్తున్న వార్తలను తప్పుపట్టారు. ప్రేక్షకులను మెప్పించే ఒక మంచి సినిమా తీయాలంటే సమయం పడుతుంది. ప్రస్తుతం ఆదిత్య చోప్రా, హృతిక్, నేను.. ముగ్గురం ఒక టీమ్‌లా చాలా స్మూత్‌గా వర్క్ చేస్తున్నాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హృతిక్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ పనుల్లో బిజీగా ఉన్నారని , ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నామని రాకేశ్ రోషన్ చెప్పుకొచ్చారు.
ALSO READ : 'పెద్ది' వివాదంలో జాన్వీకి మద్దతుగా జగపతిబాబు..
మరోవైపు, హృతిక్ రోషన్ చివరగా నటించిన YRF బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్లో హృతిక్ స్వయంగా స్పందిస్తూ.. నా సినిమా బాక్సాఫీస్ వద్ద దెబ్బతింది, అయినా ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది అంటూ ఓపెన్‌గా ఒప్పుకున్నారు. ఇదిలా ఉంటే, హృతిక్ రోషన్ 'కె.జి.ఎఫ్', 'కాంతార' ప్రొడక్షన్స్ 'హోంబలే ఫిల్మ్స్'తో చేతులు కలిపారు. హిందూ పురాణాల నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కనుంది. "తీవ్రతకు, ఊహకు ప్రతిరూపం.. ఇక్కడ బిగ్ బ్యాంగ్ మొదలవుతుంది" అంటూ క్రేజీగా అనౌన్స్ చేశారు. సో.. 'క్రిష్ 4' కంటే ముందే ఈ విజువల్ వండర్ పట్టాలెక్కేలా కనిపిస్తోంది..
