'పెద్ది' వివాదంలో జాన్వీకి మద్దతుగా జగపతిబాబు.. హీరోయిన్లకు నిత్యామీనన్ క్రేజీ సలహా!

'పెద్ది' వివాదంలో జాన్వీకి మద్దతుగా జగపతిబాబు.. హీరోయిన్లకు నిత్యామీనన్ క్రేజీ సలహా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజైంది. నాలుగు రోజుల్లోనే రూ. 292 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ కంటే ఓ వివాదం వల్లే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానం, కొన్ని కెమెరా యాంగిల్స్ తీవ్ర వివాదానికి దారితీశాయి. తెరపై మహిళలను కమర్షియల్ వస్తువులా చూపించారంటూ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాన్వీకి సపోర్ట్ గా జగపతిబాబు..

ఈ వివాదంపై ఇప్పటికే డింపుల్ హయాతీ, ఆషికా రంగనాథ్ లాంటి తారలు స్పందించగా.. తాజాగా సీనియర్ నటుడు జగపతిబాబు, నటి నిత్యామీనన్ కూడా ఈ ఇష్యూపై క్రేజీ కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన జగపతిబాబు తన కో-స్టార్ జాన్వీ కపూర్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. సినిమాలోని క్రియేటివ్ నిర్ణయాలకు ఆర్టిస్టులను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. జాన్వీ కేవలం డైరెక్టర్ ఏం చెప్తే అదే చేసింది. కొన్నిసార్లు అనుకున్నది మిస్‌ఫైర్ అవుతుంటాయి. ఈ విషయంలో నేను జాన్వీకే సపోర్ట్ ఇస్తాను. ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మానసిక వేదనకు గురిచేయకండి అంటూ జగపతిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

నిత్యామీనన్ స్ట్రాంగ్ వార్నింగ్..

మరోవైపు సహజ నటి నిత్యామీనన్ ఈ విషయంపై చాలా బోల్డ్‌గా స్పందించారు. తాను 'పెద్ది' సినిమా చూడకపోయినా జాన్వీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్తూనే, హీరోయిన్లకు ఒక క్రేజీ సలహా ఇచ్చారు. సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో మహిళలను వస్తువుల్లా చూపించడం ఒక్క సౌత్ లోనే కాదు, గ్లోబల్ సినిమాలోనే పెద్ద సమస్యగా మారిందన్నారు. ఇలాంటి విషయాల్లో హీరోయిన్లే సెల్ఫ్ కంట్రోల్ పాటించాలి. తెరపై మనల్ని గ్లామర్ పేరిట మిస్ యూస్ చేస్తున్నారనిపిస్తే.. మొహమాటం లేకుండా ముందే నో చెప్పేయాలి. ఆ పాత్రను రిజెక్ట్ చేయాలి అంటూ నిత్యా స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

►ALSO READ | Karuppu OTT Release: ఓటీటీలోకి 'వీరభద్రుడు'.. సూర్య బ్లాక్‌బస్టర్ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?

ఆ సీన్లు కట్..

వివాదం ముదరడంతో దర్శకుడు బుచ్చిబాబు సన వెంటనే అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. సినిమా ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. మహిళల పట్ల నాకు ఎప్పుడూ అమితమైన గౌరవం ఉంది. ఎవరినీ కించపరచాలనేది మా ఉద్దేశం కాదు అని చెప్తూ, నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ వివాదాస్పద సీన్లను, కెమెరా యాంగిల్స్‌ను తక్షణమే ఎడిట్ చేస్తున్నట్లు ప్రకటించి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.