వర్షాకాలంలో ఇవి తిన్నరా... రోగాలకు స్వాగతం చెప్పినట్టే...

వర్షాకాలంలో ఇవి తిన్నరా... రోగాలకు స్వాగతం చెప్పినట్టే...

వర్షాకాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలి. ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇంతకీ వర్షాకాలంలో తినకూడదని ఆ కూరగాయలు ఏవో తెలుసుకుందాం

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం మనకు తెలిసిందే. కానీ.. వర్షాకాలంలో మాత్రం ఈ ఆకుకూరలు తినకపోవడమే మంచిదట. వర్షాకాలంలో ఆకుకూరలు ఎప్పుడూ తేమగా ఉంటాయి. దానివల్ల దానిలోని పోషకాలన్నీ శరీరానికి అందే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది.

ఆకుకూరలు తింటే ఎంతో మంచిదని చెబుతుంటారు. ఎన్నో ఔషధగుణాలు స‌మృద్ధిగా ఉండే ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచివి. జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఈ ఆకుకూరలకు ఉంది. అయితే వర్షాకాలంలో మాత్రం ఆకుకూరలకు తినకుడదని చెబుతున్నారు కొందరూ ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కు తగినంత సూర్యరశ్మిలేకపోవడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఉందని ఆహార నిపుణుల అభిప్రాయం. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో క్యాబేజ్, బ్రొకోలీ, కాలీఫ్లవర్ , ఆకులు కలిగిన కూరలు చాలా దగ్గరదగ్గరగా అరలి వుండటం వల్ల వాటిలోపలి క్రిములు చేరడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా న్యూట్రీషియన్ వెజిటేబుల్స్ లో మట్టిలో ఎక్కువ నీరు గల ప్రాంతంలో పండిస్తారు క్రిములు తిష్టవేస్తాయి. వర్షాలకు క్రిములుచేరి స్టొమక్ ఇన్ఫెక్షన్స్ కు కారణం అవుతుంది ఆహార నిపుణుల అంటున్నారు. వర్షాకాలంలో ఆకుకూరలును తినాల్సి వచ్చినప్పుడు, వేడినీళ్ళలో ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడగాలి., నీరు పూర్తిగా వంపేసి తర్వాత బాగా ఉడికించి ఆహారంలో తీసుకోవాలి. లీఫ్ వెజిటేబుల్స్ తినకుడదంటానికి కొన్ని కారణాలు చెబుతున్నారు నిపుణులు. 

1. వర్షాకాలంలో ఆకుకూరల్లో బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతాయి. ఆకుల మద్య పరిశీలించినట్లైతే బ్యాక్టీరియా దాగి ఉంటుంది. కాబట్టి, వీటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. 

2. ఆకుకూరలు చిత్తడి ప్రాంతంలో పెరుగుతాయి. సూర్యకాంతి లేకపోవడం వల్ల బ్యాక్టీరియా చాలా త్వరగా చేరుతుంది. 

3. చల్లని వాతావరణంలో ఆకుకూరలు ఉంచినప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తాయి. వాటిని నిల్వ చేసే ప్రదేశం శుభ్రంగా లేకపోతే ఆకుకూరలు కలుషితం అవుతాయి. దీంతో ఫుడ్ పాయిజన్ కు దారితీస్తుంది 

4. కాలీఫ్లవర్, బ్రొకోలీ వంటి వెజిటేబుల్స్ లో సూక్ష్మ జీవులు చేరి ఆహారంగా తింటుంటాయి . ఈ రెండు హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలనుకుంటే, వీటిని ముందుగా వేడినీళ్ళలో ఉప్పు వేసి ఆనీటిలో వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి 

5. కలర్ ఇంజక్షన్స్ ను వేయడం వల్ల ఆకుకూరలకు మరింత ముదురు రంగులొ కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. ప్రేగులను బలహీనపరుస్తాయి. నిధానంగా కిడ్నీలను పాడు చేస్తాయి. 

6. ఆకుకూరలు వంటలను బయట(కర్రీపాయింట్స్)లో కొనకపోవడమే మంచిది. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లలో గ్రీన్ లీఫ్స్ ను సరిగ్గా శుభ్రం చేయకపోవచ్చు . దీంతో అవి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.