Chiranjeevi: రెండు భాగాలుగా మెగాస్టార్ 'విశ్వంభర' వస్తోందా? రూమర్లపై డైరెక్టర్ వశిష్ట క్లారిటీ!

Chiranjeevi: రెండు భాగాలుగా మెగాస్టార్  'విశ్వంభర' వస్తోందా? రూమర్లపై డైరెక్టర్ వశిష్ట క్లారిటీ!

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' . రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ చుట్టూ ఇండస్ట్రీలో క్రేజీ బజ్ నడుస్తోంది. 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతోందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ క్లారిటీ ఇచ్చేశాయి. అయితే, ఇటీవల కాలంలో ఏ పెద్ద సినిమా వచ్చినా రెండు భాగాలుగా విడగొట్టడం ఒక ట్రెండ్‌గా మారింది. ఈ క్రమంలోనే 'విశ్వంభర' కూడా పార్ట్-1, పార్ట్-2గా రానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.

డైరెక్టర్ క్లారిటీ..

ఈ క్రేజీ రూమర్లపై డైరెక్టర్ వశిష్ట సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనదైన శైలిలో సింగిల్ లైన్‌తో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై ఆయన కేవలం "అవునా.. నిజమా? " అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చి పుకార్లకు పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టేశారు. దీన్ని బట్టి 'విశ్వంభర' కేవలం ఒకే భాగంగా, అద్భుతమైన సింగిల్ ఎపిక్‌గా రాబోతోందని కన్ఫర్మ్ అయింది.

ఆలస్యానికి కారణం ఇదేనా?

నిజానికి ఈ సినిమా 2025 సంక్రాంతికే థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ, గ్రాఫిక్స్ పనుల క్వాలిటీ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా రాజీ పడకూడదని చెప్పడంతో మేకర్స్ మరింత సమయం తీసుకుంటున్నారు. ఈ సినిమాలో దాదాపు 4,800కు పైగా హై-ఎండ్ వీఎఫ్ఎక్స్ (VFX) షాట్స్ ఉన్నాయట. కేవలం గ్రాఫిక్స్ కోసమే మేకర్స్ దాదాపు రూ. 75 కోట్లు కేటాయించినట్లు సమాచారం.

కొత్త లోకం..

14 లోకాలలో అత్యున్నతమైన, బ్రహ్మదేవుడు నివసించే 'సత్యలోకం' నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలోనూ ఎక్స్ ప్లోర్ చేయని ఈ లోకాన్ని వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విజువల్స్ పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీతో వర్క్ చేయిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ విజువల్ వండర్ 2026 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

భారీ అంచనాలతో..

యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సౌత్ క్వీన్ త్రిష 'అవని' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. అలాగే అందాల భామ ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, కీలక పాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్‌గా అలరించబోతున్నాడు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటంతో ఈ సోషియో ఫాంటసీ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి..