ధరలు పెంచుతూ మోడీ చర్చకు దూరంగా ఉంటున్నరు

ధరలు పెంచుతూ మోడీ చర్చకు దూరంగా ఉంటున్నరు

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత  ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ద్రవ్యోల్బణం, జీఎస్పీ రేట్ల పెంపుపై చర్చించడం అన్ పార్లమెంటరీ కాదా అని ప్రశ్నించారు. ప్రధాని పార్లమెంట్ కు రాకుండా నిత్యావసర ధరలను అమాంతం పెంచుతున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువులపై ప్రభుత్వం పన్నులు పెంచడం కౄరమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి చర్యల వల్ల దేశంలో  ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుందన్నారు. ధరల పెంపును నిరసిస్తూ విపక్షాలు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బీజేపీ  ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపుతూ నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచిందని ఆరోపించారు.  ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్లపై పార్లమెంటులో చర్చ జరగాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు కోరుతున్నాయన్నారు.. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంశంపై అంతరాయం ఏర్పడుతుందన్నారు.