కేసీఆర్.. హిందువా.. రజాకారా?: పరిపూర్ణానంద స్వామి

కేసీఆర్.. హిందువా.. రజాకారా?:  పరిపూర్ణానంద స్వామి

Is KCR Hindu or Rajakarమద్దూరు, వెలుగు: హిందూగాళ్లు… బొందుగాళ్లు అన్న కేసీఆర్​.. హిందువా లేక రజాకారా? అని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. బైరాన్‌‌పల్లిలో అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళి అర్పించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ఉద్యమంలో సాధారణ ప్రజలు అమరులైతే నయా నిజాం కోటలో బతుకుతున్నారన్నారు.

పరిపూర్ణానంద స్వామి ఇన్ని రోజులు మౌనంగా ఎందుకు ఉన్నారని దేశమంతా ఎదిరిచూస్తున్నదని, మౌనం వీడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నెలకావచ్చు, ఆరునెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు ప్రతి తెలంగాణ పల్లెను సందర్శించి ఆత్మబలిదానాలు చేసుకున్న వారి గడపను ముద్దాడుతానన్నారు. ఒకప్పుడు తెలంగాణలో తిరుగనివ్వని కేసీఆర్‌‌కు చెమటలు పట్టించేందుకు ఈ పాదయాత్ర చేస్తానన్నారు.