Krithi Shetty: చిరు కుమార్తెగా 'ఉప్పెన' బ్యూటీ? క్లారిటీ ఇచ్చిన మెగా 158 టీమ్!

Krithi Shetty: చిరు కుమార్తెగా 'ఉప్పెన' బ్యూటీ? క్లారిటీ ఇచ్చిన మెగా 158 టీమ్!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు'మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.  రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఈ ఫుల్ జోష్ లో ఉన్న చిరు ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన158వ సినిమాను దర్శకుడు బాబీ కొల్లితో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభం కానుండగా.. మార్చి నుంచి చిరంజీవి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. 

చిరు కుమార్తెగా కృతి శెట్టి..?

అయితే మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.  ఈ మూవీలో కూతురు సెంటిమెంట్ కీలకమని టాక్. ఈ క్రమంలోనే ఈ సినిమాలో చిరంజీవి కుమార్తె పాత్ర కోసం 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.  ఈ ప్రాజెక్టుకు ఆమె ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కావడంతో ఆమె పేరు బయటకు రావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. 

అంతా అబద్ధం..

అయితే ఈ ప్రచారం పై చిత్రయూనిట్ వెంటనే స్పందించింది. కృతి శెట్టి చిరంజీవి కూతురు పాత్రలో నటిస్తోంద న్న వార్తలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. అధికారికంగా తాము సమాచారం ఇచ్చేంత వరకు ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మరో వైపు ఈ మూవీ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దే పనిలో బాబీ ఉన్నారని సమాచారం. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు, బాబీ కాంబినేషన్స్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ మార్చి 2026 నుంచి రెగ్యులర్‌గా ప్రారంభం కానుంది.

►ALSO READ | థియేటర్‌లో భయం గ్యారెంటీ: సైకలాజికల్ హారర్‌లో నవీన్ చంద్ర కొత్త అవతారం.. ‘హనీ’ టీజర్‌తో అంచనాలు హై

ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. భారీ బడ్జెట్ తో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కూడా కీలకపాత్రలో కన్పించబోతున్నారని సమాచారం.  మరో వైపు సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నాని నిర్మాణంలో 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరో మాస్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు చిరు.