అంజలి బ్రేకప్​కు కారణం అదేనా?

అంజలి బ్రేకప్​కు కారణం అదేనా?

అచ్చతెలుగు హీరోయిన్​ అంజలి(Anjali) కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్పెషల్​ సాంగ్స్​, వెబ్​ సిరీస్​లతో తెలుగు ప్రేక్షకులకు మరోసారి చేరువవుతోంది. కొంత కాలంగా అంజలి పర్సనల్​ లైఫ్​లో కొన్ని రూమర్లు మీడియాలో ప్రచారమయ్యాయి. తమిళ హీరో అజయ్​(Ajay)ను ఆమె పెళ్లి చేసుకోనుందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు వచ్చాయి.

ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. తాజాగా అంజలి తన లైఫ్​ పార్ట్​నర్​లో ఉండాల్సిన లక్షణాల గురించి తెలిపింది. ఆ వ్యక్తి ముందు తనను గౌరవించాలని.. ఆతర్వాతే ప్రేమ, అభిమానం అన్నీ అని తెలిపింది. దీంతో వీరిద్దరి బ్రేకప్​కు ఒకరిని ఒకరు గౌరవించుకోలేకపోవడమే కారణమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తనకు రిలేషన్​తో పాటు తన కెరీర్​ కూడా ఎంతో ముఖ్యమని అంజలి తెలిపింది.