పనికి తగ్గ కూలీ ఏదీ? : సిరిసిల్లలో నేత కార్మికుల ఆందోళ

పనికి తగ్గ కూలీ ఏదీ? : సిరిసిల్లలో నేత కార్మికుల ఆందోళ

రాజన్నసిరిసిల్ల,వెలుగుబతుకమ్మ చీరల కలర్‌‌‌‌ కోడ్‌‌‌‌లతో పెరిగిన పనిభారానికి తగినట్లు కూలీ రేట్లు కూడా పెంచాలని సిరిసిల్ల నేత కార్మికులు కోరుతున్నారు. గతంలో నెలకు 20వేల రూపాయల వరకు పొందిన తమకు ఇప్పుడు 15వేలు కూడా వచ్చుడు కష్టంగా ఉందంటున్నారు. చీరల డిజైన్‌‌‌‌, కలర్‌‌‌‌ కోడ్‌‌‌‌ పెంచినదానికి తగ్గట్లుగా తమ కూలీ కూడా పెంచాలని లేదంటే సమ్మెకు దిగుతామంటున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌‌‌‌లో చేనేత జౌళిశాఖ డైరక్టర్ శైలజ రామయ్యర్‌‌‌‌కు వినతిపత్రం సమర్పించారు. కూలీ రేట్లు పెంచకపోతే సమ్మెకు దిగుతామంటున్నారు. అదే జరిగితే బతుకమ్మ చీరలు సమయానికి అందించలేని పరిస్థితి తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో రేపు సిరిసిల్ల పవర్ లూమ్‌‌‌‌ కార్మిక సంఘాలు, సీఐటీయూ నేతలతో చేనేత జౌళిశాఖ అధికారులు చర్చలు జరపనున్నారు.

గతేడాది బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు మంచి వేనతాలు వచ్చాయి. కార్మికులు వారానికి ఐదు వేల రూపాలయ నుంచి ఆరు వేల చొప్పున నెలకు రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు పొందారు. 2018 లో కేవలం ప్లేన్​ క్లాత్ ఉండటంతో ఒక్కో కార్మికుడు ఎనిమిది సాంచాలు నడిపి గిట్టుబాటు కూలీ తెచ్చుకున్నారు. ఈఏడాది పలు రకాల డిజైన్లు, 100 వరకు రంగుల్లో చీరల తయారీతో పాటు.. మంచి జరీ వాడుతూ బతుకమ్మ చీరలు నేస్తున్నారు. అయితే డిజైన్లు ఎక్కువ కావడంతో మూడు కమ్ములు ఏర్పాటు చేసి తొమ్మిది పట్టీలతో చీర చేయాల్సి వస్తోంది. ఇలా ఒక చీర నేయడానికి సాంచాను18 సార్లు ఆపాల్సి వస్తుండటంతో చీరల తయారీ ఆలస్యమవుతోంది. ఒక కార్మికుడు గతేడాదిలా ఎనిమిది సాంచాలు నడపలేక ఆరు మాత్రమే నడపగలుగుతున్నారు.

దీంతో నెలకు వచ్చే కూలీ తగ్గింది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితమే కార్మికులు సిరిసిల్లలో ఆందోళ చేపట్టారు. కార్మిక సంఘాల నాయకులు,సీఐటీయూ నేతలు చేనేత జౌళిశాఖ డైరక్టర్​ శైలజ రామయ్యార్‌‌‌‌కు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం మీటరు బట్టకు రూ.32.50 ఇస్తుండగా.. మెటీరియల్ కాస్ట్​ పోను.. కార్మికుడికి రూ.4.25, ఆసామికి రూ.4.25 కూలీ రేటు పడుతోంది. కార్మికుల ప్రస్తత కూలీ రేటుకు అదనంగా మీటరుకు రూ.75 పైసలు పెంచి ఐదు రూపాయాలు ఇవ్వాలని వారు కోరుతున్నాయి. బతుకమ్మ చీరల తయారీలో 121 మ్యాక్​ సంఘాలు, 105 ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ సంఘాలు పాలుపంచుకుంటున్నాయి. 30 వేల మరమగ్గాలపై 20 వేలకు పైగా కార్మికులు చీరలు నేస్తున్నారు.