వాళ్ల అధికారం ఆర్నెల్లే

వాళ్ల అధికారం ఆర్నెల్లే

రాంచీ: అవకాశవాదంతో, అధికారం కోసం ఏర్పడిన శివసేన, ఎన్‌‌సీపీ, కాంగ్రెస్‌‌ కూటమి కేవలం ఆరు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ అన్నారు. పార్టీ ఐడియాలజీని కాదని మరీ కూటమిగా ఏర్పడ్డారని విమర్శించారు. బీజేపీని అధికారానికి దూరం చేయడం కోసమే ఆ మూడు పార్టీలు ఏకమయ్యాయని అన్నారు. శుక్రవారం జార్ఖండ్‌‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్కరీ.. మీడియా ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్​ ​చేశారు. “వాళ్ల కూటమికి అవకాశవాదం పునాది. కేవలం బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకే ఒకటయ్యారు. వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే డౌటు.. ఒకవేళ చేసినా 6 నుంచి 8 నెలలు మాత్రమే అధికారంలో ఉంటరు’ అని గడ్కరీ చెప్పారు. కూటమి విడిపోయి, బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే చాన్స్‌‌ వస్తే ఏంచెయ్యాలనే దానిపై ఫైనల్​ డెసిషన్​ పార్టీదేనన్నారు. పాలిటిక్స్‌‌లో, క్రికెట్‌‌లో ఏప్పుడైనా.. ఏదైనా జరగొచ్చని చెప్పారు. శివసేన చెప్పినట్లు రొటేషనల్‌‌ పద్ధతిలో సీఎం పదవిని పంచుకునే అంశంపై చర్చ జరగలేదని, ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ సీఎం పదవిని చేపట్టాలనే రూల్‌‌ ఉందని చెప్పారు. బీజేపీ, శివసేన హిందుత్వ బేస్‌‌ మీదే కూటమిగా ఏర్పడిందని, ఆ కూటమిని నిలబెట్టడానికి తమ వంతుగా కృషి చేశామని గడ్కరీ తెలిపారు.