నంబర్​ వన్​పోలీసింగ్​అంటే ఇదా?: ఎమ్మెల్యే రఘునందన్ రావు

నంబర్​ వన్​పోలీసింగ్​అంటే ఇదా?: ఎమ్మెల్యే రఘునందన్ రావు
  • తెలంగాణలో మహిళకు రక్షణ లేదు
  • బాధిత కుటుంబానికి అండగా  బీజేపీ 
  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు

హైదరాబాద్: రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ విఫలమైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఓ గిరిజన మహిళను అర్థరాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి భౌతిక దాడి చేయడం దారుణమన్నారు. 
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనం అన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. కర్మన్ ఘాట్ జీవన్ ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన ఆయన..  బాధ్యులైన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

‘బాధిత మహిళ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నా రఘునందన్ రావు. న్యాయ, ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రక్షక వ్యవస్థ  విఫలమైందనే దానికి ఈ ఘటన  నిదర్శనమని మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించకపోవడం, మహిళను పరామర్శ చేయకపోవడం చూస్తూ జరిగిన తప్పు ప్రభుత్వందే అని రుజువు చేస్తోందన్నారు. 

నగర నడిఒడ్డున  మహిళకే రక్షణ కరువైందని విమర్శించారు. కానీ తెలంగాణ పోలీస్ ‘‘భద్రత మాదే.. బాధ్యత మాదే  అంటూ’’ .. దేశంలో నంబర్ వన్ పోలీసింగ్ అని ప్రచారం చేసుకుంటున్నరని.. దేశంలో ఏ ఘటన జరిగిన ట్విట్టర్ లో ప్రశ్నించే  సీఎంఓ లోని ఐఏఎస్ అధికారిని హైదరాబాద్ లో,  తెలంగాణలో జరిగితే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీసులు.. కేవలం కింద స్థాయి పోలీసులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారన్నారు. 

రాచకొండ కమిషనర్ దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలి’ అని రఘునందన్​రావు డిమాండ్ చేశారు.