
‘డిజే టిల్లు’లో తన మార్క్ మేనరిజమ్స్, డైలాగ్స్‌తో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సిద్దు జొన్నలగడ్డ.. ఆ మూవీ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
సెప్టెంబర్ 15న సినిమాను విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించిన మేకర్స్.. తాజాగా సినిమాని వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వల్లే వాయిదా వేస్తున్నామని, క్వాలిటీ ఔట్‌పుట్ కోసం పోస్ట్ పోన్ చేయక తప్పడం లేదని చెప్పారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు.