వరల్డ్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇషా సింగ్‌కు గోల్డ్‌ మెడల్

వరల్డ్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇషా సింగ్‌కు గోల్డ్‌ మెడల్

హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియా టీనేజ్‌‌ షూటర్‌‌,  తెలంగాణ స్టార్ ఇషా సింగ్‌‌ ఐఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ వరల్డ్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో తొలి గోల్డ్‌‌ మెడల్‌‌ కైవసం చేసుకుంది.  జూనియర్‌‌ విమెన్స్‌‌ 25 మీటర్ల  పిస్టల్‌‌ ఈవెంట్‌‌లో తను చాంపియన్‌‌గా నిలిచింది. కైరోలో శనివారం జరిగిన ఫైనల్లో 40 ఫైర్‌‌ షాట్లకు గాను ఇషా 29 హిట్స్‌‌తో టాప్‌‌ ప్లేస్‌‌ సాధించింది.

 గతేడాది  జూనియర్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో రెండు సిల్వర్‌‌ మెడల్స్‌‌ రాబట్టిన ఇషా ఈసారి జూనియర్‌‌ వరల్డ్‌‌  చాంపియన్‌‌గా నిలిచింది. 25మీ. విమెన్స్‌‌ టీమ్‌‌ ఈవెంట్‌‌లో ఇషా ఇప్పటికే బ్రాంజ్‌‌ నెగ్గింది.  మెన్స్‌‌ 25 మీ. పిస్టల్‌‌లో  గోల్డ్‌‌ నెగ్గిన  ఉదయ్‌‌వీర్‌‌ సిద్ధూ.. 25 మీ. స్టాండర్డ్‌‌ పిస్టల్‌‌ ఈవెంట్‌‌లోనూ మరో బంగారు పతకం గెలిచాడు. స్టాండర్డ్‌‌ పిస్టల్‌‌ మెన్స్‌‌లో సమీర్‌‌, విమెన్స్‌‌లో తేజస్విని బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ రాబట్టారు.