ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ.. ఫస్ట్ ఇన్నింగ్స్‎లో జార్ఖండ్ భారీ స్కోర్

ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ.. ఫస్ట్ ఇన్నింగ్స్‎లో జార్ఖండ్ భారీ స్కోర్

కోయంబత్తూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (125 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సెంచరీకి తోడు సాహిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (64 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చెలరేగడంతో తమిళనాడుతో బుధవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 90 ఓవర్లలో 307/6 స్కోరు చేసింది.

టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆరంభంలో తమిళనాడు బౌలర్లు దెబ్బకొట్టారు. శరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (48), విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (28) మోస్తరుగా ఆడినా.. వరుస విరామాల్లో శిఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10), కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3), కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుశాగ్ర (11), అనుకూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (12) ఔటయ్యారు. దాంతో 157/6తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాహిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 150 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేసి ఆదుకున్నారు. గుర్జప్నీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 వికెట్లు తీశాడు. 

భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ.. ఆంధ్ర 289/3

కాన్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆంధ్ర భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. శ్రీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (142) భారీ సెంచరీకి తోడు షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (94 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రాణించడంతో.. బుధవారం తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 85.5 ఓవర్లలో 289/3 స్కోరు చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఆంధ్రకు భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి పునాది వేశాడు. ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి (36)తో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 93, రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 194 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేశాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికీ భుయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2) నిరాశపర్చాడు. అకీబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు వికెట్లు తీశాడు. 

పృథ్వీ డకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రుతురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 91

టీమిండియాలో రీఎంట్రీపై ఆశలు పెట్టుకున్న మహారాష్ట్ర బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పృథ్వీ షా (0) కేరళతో తిరువనంతపురంలో మొదలైన రంజీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరాశపర్చాడు. రుతురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (91) మెరుగ్గా ఆడటంతో టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన మహారాష్ట్ర ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 59 ఓవర్లలో 179/7 స్కోరు చేసింది. విక్కీ ఓస్త్వాల్‌‌ (10 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), రామకృష్ణ ఘోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (11 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. 

కేరళ బౌలర్లు నిధీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4/42), బాసిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/44) దెబ్బకు పృథ్వీ, అర్షిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కులకర్ణి (0), సిద్ధేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0), అంకిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బావ్నే (0), సౌరభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవాలే (12) నిరాశపర్చారు. సున్నాకు మూడు, 18 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఐదు వికెట్లు కోల్పోయిన మహారాష్ట్రను రుతురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జలజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 122 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించి ఆదుకున్నారు. తర్వాత 24 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో ఈ ఇద్దరూ ఔటయ్యారు. 

షమీ 4 బాల్స్‌‌లో 3 వికెట్లు.

టీమిండియాకు దూరమైన బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షమీ (3/37) రంజీ ట్రోఫీని ఘనంగా ఆరంభించాడు. కోల్‌‌‌‌‌‌‌‌కతాలో ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రారంభమైన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షమీ నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. సూరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింధు జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4/54), ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3/40) కూడా చెలరేగడంతో.. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిన ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 72.5 ఓవర్లలో 213 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 

భూపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లల్వానీ (71) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఓవర్లలో 8/1 స్కోరు చేసింది. అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0) డకౌటయ్యాడు. సుదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చటర్జీ (1 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), సుదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గరామీ (7 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు.