
హైదరాబాద్: తన సినిమా స్క్రిప్ట్‌ను మురళి కృష్ణ అనే వ్యక్తి సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేశాడంటూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. త్వరలో విడుదల కాబోయే తన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ స్క్రిప్టును ఇన్‌స్టాగ్రామ్ బజ్ బాస్కెట్ గ్రూప్ లో అడ్మిన్ మురళి కృష్ణ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ డిలీట్ చేయాలంటే తనకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో నిర్మాణ సంస్థలు పూరి జగన్నాథ్ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ తరుపున రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.