
జెరూసలెం: ఇరాన్‌పై దాడికి కొన్నేండ్ల క్రితమే ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. ఆ దేశం న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ చేపట్టిందని ఆధారాలతో సహా 2018లో నిరూపించింది. అయినా ఇరాన్ బుకాయిస్తూ రావడంతో ఆ దేశ అణుస్థావరాలపై ఇప్పుడు దాడులు మొదలుపెట్టింది.
2018 జనవరి 31 అర్ధరాత్రి టెహ్రాన్‌లోని ఓ వేర్‌హౌస్‌లోకి ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ ఏజెంట్లు చొరబడ్డారు. సెక్యూరిటీ గార్డులను, అలారమ్స్‌ను దాటుకుని చడీచప్పుడు కాకుండా ఆపరేషన్ పూర్తి చేశారు.
ఆ వేర్‌హౌస్‌లో ఇరాన్ దాచిపెట్టిన న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన బ్లూప్రింట్స్ దొంగలించారు. దాదాపు 50 వేల డాక్యుమెంట్లు, 163 సీడీలను ఎత్తుకెళ్లారు. వాటన్నింటినీ విశ్లేషించి దాదాపు 500 కిలోల అణుబాంబుల తయారీకి ఇరాన్ ప్రణాళిక రచించినట్టు గుర్తించారు.