గాజాలో ఆస్పత్రి దాడుల బాధితులకు ఈజిప్ట్ సాయం

గాజాలో ఆస్పత్రి దాడుల బాధితులకు ఈజిప్ట్ సాయం

గాజాలో ఆస్పత్రిపై దాడుల్లో గాయపడ్డవారికి చికిత్సచేసేందుకు ఇజ్రాయెల్ ఈజిప్టుకు అనుమతినిచ్చింది. ఇటీవల గాజాలో ఆస్పత్రి పై జరిగిన దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక గాయాలపాలయ్యారు. వారికి చికిత్స చేసేందుకు అక్కడి వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో.. ఈజిప్టు కొంత వైద్యపరమైన సాయం చేసేందుకు ఇజ్రాయెల్ సాయం కోరింది. ఆస్పత్రి పేలుడు బాధితులకు చికిత్స చేసేందుకు వైద్యులు కష్టపడుతున్నందున గాజాకు సాయం చేయడానికి ఇజ్రాయెల్ ఈజిప్టు అనుమతిచ్చింది.

హమాస్ తీవ్రవాద సంస్థ జరిపిన దాడుల తర్వాత గాజాపై ఇజ్రాయెల్ ప్రతి దాడులకు దిగింది. గాజా పై వైమానిక దాడులు చేస్తోంది. బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా సిటీకి  నీరు, ఆహారం , ఇతర సామాగ్రి అందకుండా ఇజ్రాయెల్ కట్టడి చేసింది.
 
అయితే మంగళవారం రాత్రి( అక్టోబర్ 18) గాజాపై జరిగిన దాడుల వెనక ఎవరున్నారనేది వివాదాస్పద వాదనలు ఉన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ సైన్యమే  దాడలుకు పాల్పడిందని అరబ్ నేతలు చెప్పడంతో నిరసనలు చెలరేగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులను హమాస్ అధికారులు చెపుతున్నారు.. ఈ దాడుల్లో వందలాది మరణించారని చెప్పారు. 
దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం.. దాడుల మేం చేయలేదని ప్రకటించింది. గాజాలో పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూప్ ఇస్లామిక్ జిహాద్ మిస్ ఫైరింగ్ కారణంగా పేలుడు సంభవించిందని వీడియోలు ఆడియోలు విడుదల చేసింది. అయితే ఇస్లామిక్ జిహాద్ ఆ వాదనను తోసిపుచ్చింది.