కాల్పుల విరమించేది లేదు.. అమెరికా పిలుపుని రిజెక్ట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని

కాల్పుల విరమించేది లేదు.. అమెరికా పిలుపుని రిజెక్ట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 60 మందికి పైగా బందీలు తప్పి పోయారని పాలస్తీనా మిలిటెంట్ ఫ్యాక్షన్ హమాస్ ప్రకటించింది. హమాస్ టెలిగ్రామ్ ఖాతాలో ఇజ్రాయెల్ బందీలుగా ఉన్న 23 మంది మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకున్నాయని చెప్పారు. 

అయితే గాజాపై ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నిస్తోంది. మానవతా కోణంలో కాల్పులు విరమణ జరపాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సూచించారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేసేవరకు కాల్పుల విరమణ ఉండదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పట్టుబడ్డారు. 

అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులు చేయడంతో 14వందల మంది ఇజ్రాయిలీలు ప్రాణాలు కోల్పోయారు. హామాస్ ఉగ్రవాదులు 240మందిని అహపరించారు. ప్రతీకారంగా సైనిక ఆపరేషన్ ప్రారంభించిన ఇజ్రాయెల్ 5వారాల పాటు గాజాను దిగ్భంధించి వైమానిక దాడులకు పాల్పడుతోంది. హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక, ఫిరంగి దాడుల్లో 3వేల 900 మంది పిల్లలు, 150 మంది వైద్య సిబ్బందితో సహా 9వేల 488 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.