
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు ఇస్రో చెర్మన్ డా. కె. శివన్. రేపు పొద్దున 5.30 నిమిషాలకు PSLV C46 ప్రయోగించనున్నట్లు తెలిపారు. రాకెట్ ప్రయోగం విజవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. PSLV C46 ఇస్రోకు ప్రతిష్ఠత్మకం అని ఆయన అన్నారు. రీ శ్యాట్ 2B ప్రయోగం చాలా ముఖ్యమయినదని.. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ పై పనిచేయనుందని తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో కీలక ప్రయోగాలకు ఇస్రో రెడీ అవుతుందని తెలిపారు. జులై రెండవ వారంలో చంద్రయాన్ 2 కు ఇస్రో రెడీ అవుతందని తెలిపారు.