అంతరిక్షం పిలుస్తుంది : స్టూడెంట్స్ కు ఇస్రో కాంపిటీషన్స్

అంతరిక్షం పిలుస్తుంది : స్టూడెంట్స్ కు ఇస్రో కాంపిటీషన్స్

అంతరిక్ష అంశాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారా? స్పేస్ పై మీకున్న నాలెడ్జ్ ను నలుగురితో పంచుకోవాలనుందా? మరెందుకాలస్యం ఇస్రో విక్రమ్ సారాబాయ్ సెంటినరీ ప్రోగ్రామ్ పేరుతో నిర్వహిస్తున్న కాంపిటీషన్స్ లో పాల్గొనండి. 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
స్పేస్ ప్రోగ్రామ్స్ పై విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేందుకు ఇస్రో.. హైదరాబాద్‌ లో ని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, అటామిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ , న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్ తో కలిసి అక్టోబర్‍ 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల ‘విక్రమ్ సారాబాయ్ సెంటినరీ ప్రోగ్రామ్’ పేరిట సెంటినరీ ఎగ్జిబిషన్, మెమోరియల్​ లెక్చర్ ఏర్పాటు చేసుంది. ఈ సందర్భంగా ఎస్సే కాంపిటీషన్‍, పెయిటింగ్‍, పిక్‍ అండ్‍ స్పీక్‍, క్విజ్‍, స్కిట్‍ వంటి పోటీలను వ్యక్తిగతంగా/గ్రూప్ గా నిర్వహిస్తోంది.

6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనొచ్చు. అంతరిక్ష రంగానికి విక్రమ్ సారాభాయ్ చేసిన కృషి, ఆయన విజయాలు, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ , అటామిక్​ ఎనర్జీ తదితర అంశాలపై వెబ్ సైట్​లో ఇచ్చిన థీమ్స్ ను సెలెక్ట్​ చేసుకొని వివరించాలి. విజేతలకు బహుమతులు ఇస్తారు. రిజిస్ట్రేషన్స్ ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేమ్‍ ఆఫ్‍ కాంపిటేషన్‍, టీం డీటెయిల్స్, స్కూల్‍/కాలేజీ పేరు, స్లాట్​ టైమ్ , నంబర్‍ ఆఫ్‍ పర్సన్స్, కాంటాక్ట్ నెంబర్‍ వంటి సమాచారాన్ని gmoutreach@nrsc.gov.in కి మెయిల్‍ చేయాలి. వివరాలకు 040 23884594, 23884801 ఫోన్‍ నెంబర్లలో లేదా మీ జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించవచ్చు. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. షెడ్యూల్ ఎస్సే: అక్టోబర్‍ 14; పెయింటింగ్‍: అక్టోబర్‍ 15;పిక్‍ అండ్‍ స్పీక్‍: అక్టోబర్‍ 15; క్విజ్‍: అక్టోబర్‍ 16న; స్కిట్‍: అక్టోబర్‍ 17.
వివరాలకు: www.nrsc.gov.in