ఇస్రో గుడ్ న్యూస్.. విక్రమ్ ల్యాండర్ కనపడింది

ఇస్రో గుడ్ న్యూస్.. విక్రమ్ ల్యాండర్ కనపడింది

చంద్రయాన్ 2 కు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఆర్బిటర్ గుర్తించిందని చెప్పారు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్. “చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రదేశాన్ని మేం గుర్తించాం. ఆర్బిటర్ ఇందుకు సంబంధించిన థర్మల్ ఇమేజ్ ను తీసి పంపింది. ఐతే.. ఇంకా విక్రమ్ ల్యాండర్ నుంచి.. ఆర్బిటర్ కు గానీ… గ్రౌండ్ స్టేషన్స్ కు గానీ కమ్యూనికేషన్ రాలేదు. విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. అతిత్వరలోనే విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేట్ అవుతాం” అని ఇస్రో చైర్మన్ శివన్ చెప్పారు.

చంద్రయాన్ 2 లో భాగంగా జులై 22న నింగిలోకి పంపిన శాటిలైట్.. విక్రమ్ ల్యాండర్… సెప్టెంబర్ 7వ తేదీన తెల్లవారుజామున 1.45 నిమిషాలకు చంద్రుడివైపు కదిలింది. ఐతే.. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు విక్రమ్ ల్యాండర్ నుంచి.. ఆర్బిటర్, గ్రౌండ్ స్టేషన్స్ కు కాంటాక్ట్ కట్ అయింది. చంద్రుడిపై స్థిరమైన కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ తో… విక్రమ్ ల్యాండర్ జాడను తాజాగా ఇస్రో కనిపెట్టింది.