నింగిలోకి LVM3 రాకెట్.. ఇస్రో నుంచి మరో భారీ ప్రయోగం..

నింగిలోకి LVM3 రాకెట్.. ఇస్రో నుంచి మరో భారీ ప్రయోగం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి నాంది పలికింది.  శ్రీహరికోట నుంచి అత్యంత బరువైన శాటిలైట్ CMS-03 ను ప్రయోగించింది. ఇండియా నుంచి నింగిలోకి వెళ్లిన శాటిలైట్లలో ఇదే అత్యంత బరువైన శాటిలైట్ కావడం విశేషం. ఆదివారం ( నవంబర్ 2 ) 5:26 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది బాహుబలి రాకెట్. మొత్తం 4 వేల 410 కిలోల బరువున్న ఈ శాటిలైట్ LVM3-M5 రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు.

ఈ రాకెట్ ను GSLV మార్క్-3 అని కూడా పిలుస్తారు ఇస్రో శాస్త్రవేత్తలు.చంద్రయాన్-3 మిషన్ కు వాడిన రాకెట్ నే ఈ ప్రయోగానికి వాడటం విశేషం.43.5 మీటర్ల పొడవున్న  LVM3-M5 రాకెట్ ప్రారంభ సమయంలో 642 టన్నుల బరువుతో నింగికి ఎగిరింది. LVM3-M5 రాకెట్ లాంచ్ అయ్యాక రెండువైపులా ఉన్న ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్స్ మండి 642 టన్నుల బరువున్న రాకెట్ భూమి నుంచి నింగికి దూసుకెళ్లింది.

ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్న CMS-03 కమ్యూనికేషన్ శాటిలైట్ పదేళ్ల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందించనుంది.ఈ ప్రయోగం విజయవంతమైతే... మారుమూల ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడం సాధ్యమవుతుందని అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.  

శాస్త్రవేత్తలు అనుకున్నట్లుగానే బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఇస్రో సైంటిస్టులు షార్ నుండి ఇప్పటివరకు ఇంత బరువు కలిగిన శాటిలైట్ ను పంపడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. ఇస్రో మరో మైలురాయిని చేరుకుంటుందని చెప్పాలి.