ల్యాండర్ పంపిన చంద్రుడి తొలి ఫోటోలు ఇవే

ల్యాండర్ పంపిన  చంద్రుడి  తొలి ఫోటోలు ఇవే

కాసేపటి క్రితం చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయిన  చంద్రయాన్ నాలుగు ఫోటోలు తీసి  ఇస్రోకు  పంపించింది. ఇపుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  హరిజంటల్ వెలాసిటీ నుంచి వర్టికల్ వెలాసిటీకి మారే క్రమంలో చంద్రుడి  6.కి.మీ దూరం నుంచి ఈఫోటోలు తీయబడ్డాయి. ఈ చందమామ పిక్స్ ను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అటు బెంగళూరులోని  తమ కేంద్రం- - చంద్రయాన్ 3 ల్యాండర్ మధ్య కమ్యూనికేషన్ మొదలైందని ఇస్రో తెలిపింది.

భారత్ కొత్త చరిత్ర

అంతరిక్ష చరిత్రలో  కొత్త చరిత్రను లిఖించామన్నారు ప్రధాని మోడీ.  ఇది నవభారత విజయమని కొనియాడారు మోడీ.  ఇది 140 కోట్ల మంది విజయమని.. ఆజాదీకా అమృత ఘడియల్లో  ఇది తొలి విజయం అని అన్నారు. బ్రిక్స్ సదస్సులో ఉన్నా తన  మనసంతా చంద్రయాన్ 3 పైనే ఉందని చెప్పారు మోడీ. ఇక నవశకానికి కొత్త కథలు చెప్పొచ్చన్నారు మోడీ. చంద్రయాన్ 3 సక్సెస్ తో తన  జీవితం ధన్యమయ్యిందన్నారు. గగన్యాన్ లో కూడా ఇక విజయాలు సాధిస్తామని  చెప్పారు.

దేశం కోసం స్ఫూర్తిదాయక  కార్యంద సాధించినందుకు గర్వంగా ఉందన్నారు ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్.  ఇది ఏ ఒక్కరి విజయం కాదని.. ఇస్రో శాస్త్రవేత్తల కృషి అని  కొనియాడారు. ప్రయోగం కోసం ఎంతో కష్టపడ్డామని.. తమ నాలుగేళ్ల కృషి ఫలించిందన్నారు.   తాము రాబోయే 14 రోజుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.   ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రయోగం సక్సెస్ కావాలంటూ కోరుకున్న ప్రతీ భారతీయుడికి ధన్యవాదాలు తెలిపారు.