
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో ) PSLV-C47 రాకెట్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. దీని జీవితకాలం ఐదు సంవత్సరాలు. కక్ష్యలోకి వెళ్లిన 26.50 నిమిషాలలోనే 14ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది PSLV-C47. మూడోతరం ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం కార్టోశాట్-3 ప్రవేశపెట్టనుంది. ఈ కార్టోశాట్ దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషించనుంది. వీటి బరువు సుమారుగా 1700 కిలోలుగా ఉండనుంది.
ఇస్రో చైర్మెన్ శివన్ మాట్లాడుతూ… PSLV-C47 కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని అందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కార్టోసాట్-3అనేది ఇండియా కు చెందిన హైఎస్ట్ రిజల్యూషన్ సివిలియన్ స్పేస్ క్రాఫ్ట్ అని తెలిపారు. ఇది భూమిపై జరిగే విపత్తులను కనిపెట్టి సమాచారం ఇవ్వడంలో అడ్వాన్స్ డ్ వర్షన్ అని చెప్పారు. PSLV-C47కు పనిచేసిన శాస్త్రవెత్తలందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
PSLV-C47విజవంతమైనందుకు ఇస్రో టీంకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంధ్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. ఇది దేశ శాస్త్రవేత్తల విజయమని.. వారి ప్రతిభ అమోఘమని అన్నారు.
#ISRO Chief Dr. K Sivan: I am happy that PSLV-C47 injected precisely in the orbit with 13 other satellites. Cartosat-3 is highest resolution civilian satellite; We have 13 missions up to March- 6 large vehicle missions and 7 satellite missions. pic.twitter.com/18bZ9UFhQm
— ANI (@ANI) November 27, 2019