ఆగస్ట్ 15.. ఇస్రో అద్భుతం.. అతి పెద్ద భూ పరిశోధన ఉపగ్రహం ప్రయోగం

ఆగస్ట్ 15.. ఇస్రో అద్భుతం.. అతి పెద్ద భూ పరిశోధన ఉపగ్రహం ప్రయోగం

ఆగస్టు 15న అద్భుతానికి శ్రీకారం చుట్టబోతోంది ఇస్రో. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్మాల్ శాటిలైట్ వెహికల్  (ఎస్‌ఎస్‌ఎల్‌వి)ని ఉపయోగించి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్)ను ప్రయోగించనుంది ఇస్రో. ఎస్‌ఎస్‌ఎల్‌వి థర్డ్ అండ్ ఫైనల్ డెవలప్మెంట్ ఫ్లైట్ ఆగస్టు 15వ తేదీ ఉదయం 9:17 గంటలకు శ్రీహరికోట నుండి బయలుదేరుతుందని ఇస్రో ప్రకటించింది. ఎస్‌ఎస్‌ఎల్‌వి D3/EOS-08గా నామకరణం చేసిన ఈ మిషన్ లో సుమారుగా 175.5 కిలోల బరువున్న మైక్రో-శాటిలైట్ EOS-08ని మోసుకెళ్లనుందని సమాచారం.

EOS-08 మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యాలలో... మైక్రో-శాటిలైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, మైక్రో-శాటిలైట్ బస్‌కు అనుగుణమైన పేలోడ్ ఇన్స్ట్రుమెంట్స్ ని క్రియేట్ చేయటం, ఫ్యూచర్ ఆపరేషనల్ శాటిలైట్స్ కి అవసరమైన కొత్త టెక్నికాలిటీస్ ని చేర్చడం వంటివి ఉన్నాయి. ఈ మిషన్ SSLV డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తుందని తెలిపింది ఇస్రో.