2022లో ఇస్రో తొలి ప్రయోగం విజయవంతం

2022లో ఇస్రో తొలి ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ అయింది. ఇవాళ ఉదయం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ 52 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 5 గంటల 9 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లిన వాహక నౌక.. సక్సెస్ ఫుల్ గా మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది ఇస్రో. 18 నిమిషాల 31 సెకన్లలో శాటిలైట్స్ ని నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ ఏడాదిలో ఇస్రోకు ఇదే ప్రయోగం. అలాగే ఇస్రో చైర్మన్ గా సోమనాథ్ బాధ్యతలు తీసుకున్నాక ఇది మొదటి ప్రయోగం. ఇస్రో విజయాశ్వం పీఎస్ఎల్వీ ద్వారా చేపట్టిన ప్రయోగాల్లో ఇది 54వ సక్సెస్. ఇవాళ ఉదయం చేపట్టిన ప్రయోగం ద్వారా ఆర్ఐశాట్-1, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్ స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను కక్ష్యలో చేర్చింది. వీటిలో 1710 కిలోల బరువైన ఆర్ఐశాట్-1 పదేళ్ల పాటు సేవలను అందించనుంది. వ్యవసాయం, అటవీ, జల వనరుల నిర్వహణకు సంబంధించిన విలువైన సమాచారాన్ని శాటిలైట్ ఇమేజింగ్ డేటా రూపంలో ఎప్పటికప్పుడు ఇస్రో కమాండ్ సెంటర్ కు పంపనుంది. 

భారత్, భూటాన్ కలిసి చేసిన శాటిలైట్

ఐఎన్ఎస్-2టీడీ శాటిలైట్ ను భారత్, భూటాన్ కలిసి రూపొందించాయి. ఈ ఉపగ్రహం లైఫ్ టైమ్ ఆరు నెలలు. భవిష్యత్తు సైన్స్, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం దీనిని డెవలప్ చేశారు. దీని బరువు 17.5 కిలోలు. ఇక ఇన్ స్పైర్ శాట్-1 ఉపగ్రహాన్ని దేశంలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు కలిసి డెవలప్ చేశారు. తక్కువ భూకక్ష్యలో ఉండే ఈ ఉపగ్రహం అయానోస్పియర్ స్టడీ కోసం రూపొందించారు. ఏడాది పాటు ఇది సేవలను అందించనుంది.

మరిన్ని వార్తల కోసం..

సర్జికల్ స్ట్రైక్స్ పై నాకూ అనుమానాలున్నయ్

ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టు హెల్త్ స్టాఫ్​కు వెయిటేజీ

ఏప్రిల్ 1 నుంచి కేంద్ర నిధులు.. నేరుగా లబ్ధిదారులకే!