ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేజస్వినికి గోల్డ్

ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేజస్వినికి గోల్డ్

సుల్ (జర్మనీ):  ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షూటర్ తేజస్విని ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ మెడల్ నెగ్గింది. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో తను టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. హర్యానాకు చెందిన 20 ఏండ్ల తేజస్వినికి ఇది తొలి వ్యక్తిగత వరల్డ్ కప్ పతకం కావడం విశేషం. సోమవారం జరిగిన ఫైనల్లో తేజస్విని 31–29తో ఇండివిడ్యువల్ న్యూట్రల్ అథ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన అలీనా నెస్టియారోవిచ్ పై విజయం సాధించింది. 

అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేజస్విని   మొత్తం 575 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో  ఇండియా మూడు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాలుగేసి రజతం, కాంస్యాలతో మొత్తం 11 పతకాలు నెగ్గి  అగ్రస్థానం కైవసం చేసుకుంది.