
లోనాటో (ఇటలీ): ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ వరల్డ్ కప్‌లో ఇండియా స్కీట్ షూటర్లకు నిరాశ ఎదురైంది. క్వాలిఫికేషన్ రౌండ్ల మూడో రోజు, మంగళవారం (జులై 08) ఒక్కరు కూడా ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మెన్స్ స్కీట్ విభాగంలో 49 ఏండ్ల మైరాజ్ అహ్మద్ ఖాన్ మొత్తం 121 పాయింట్లు సాధించి 34వ స్థానంతో సరిపెట్టాడు.
ఒలింపియన్ అనంత్ జీత్ సింగ్ నరుకా మొత్తం 119 పాయింట్లతో 176 మంది పోటీదారుల్లో 64వ ప్లేస్‌లో నిలిచాడు. మరో షూటర్ భవతేగ్ సింగ్ గిల్ కూడా 119 పాయింట్లు సాధించి 75వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. విమెన్స్ స్కీట్‌లో మహేశ్వరి చౌహాన్ మొత్తం 116 పాయింట్లు సాధించి 31వ స్థానంతో ఫైనల్‌కు చాలా దూరంలో నిలిచిపోయింది.