
నికోసియా (సైప్రస్): ఒలింపియన్ కైనన్ చెనాయ్, సబీరా హారిస్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ వరల్డ్ కప్‌లో ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్యం గెలిచారు. ఆదివారం ముగిసిన మెగా టోర్నీలో ఇండియాకు ఏకైక పతకం అందించారు. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కైనన్- సబీరా 34-–33 తేడాతో టర్కీ జంట టోల్గా టున్సర్– పెలిన్ కాయాను ఓడించారు. దీంతో ఇండియా ఒకే కాంస్యంతో ఈ టోర్నీ ముగించింది. ఈ ఈవెంట్‌లో చైనాకు గోల్డ్, పోలాండ్‌కు సిల్వర్ లభించాయి.
అంతకుముందు వ్యక్తిగత విభాగాల్లో ఇండియా నుంచి ఒక్కరు కూడా ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. కైనన్ మెన్స్ ట్రాప్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో కాస్త మెరుగైన పెర్ఫామెన్స్ చేసినా మొత్తంగా117 పాయింట్లతో 17వ స్థానంతో సరిపెట్టాడు. షార్దూల్ విహాన్, భవనేష్ మెండిరట్టా వరుసగా 62,65వ స్థానాలతో నిరాశపరిచారు. విమెన్స్ కేటగిరీలో కీర్తి గుప్తా, రాజేశ్వరి కుమారి, సబీరా హారిస్ కూడా ఫైనల్‌కు క్వాలిఫై అవ్వలేపోయారు.