మైత్రి మూవీ మేకర్స్ లో ముగిసిన ఐటీ, జీఎస్టీ అధికారుల సోదాలు

మైత్రి మూవీ మేకర్స్ లో ముగిసిన ఐటీ, జీఎస్టీ అధికారుల సోదాలు

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ లో ఐటీ, జీఎస్టీ అధికారుల సోదాలు ముగిశాయి. మొత్తం 15 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో కీలక పాత్రలతో పాటు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వరుస భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్... ఇవి రెగ్యులర్ గా జరిగే ఐటీ రైడ్సేనని చెప్తున్నారు. అయితే ఈ సోదాల్లో భారీ చిత్రాలకు నిర్మాణ వ్యయాన్ని ఏవిధంగా సమకూర్చుతున్నారానే దానిపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ మేరకు సినిమాల ద్వారా వచ్చిన భారీ లాభాలపై పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలను ఐటీ అధికారులు పరిశీలించారు.

 పుష్ప, శ్రీమంతుడు, సర్కార్ వారి పాట ,రంగస్థలం, జనతా గ్యారేజ్ లాంటి భారీ హిట్ మూవీలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ పై నిన్నటి నుంచి ఐటీ అధికారులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఈ దాడులు కొనసాగాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్, అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన వాళ్లనే అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో పాటు... ఏపీ నుంచి వచ్చిన స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు హిట్ కొట్టిన సినిమాలకు పెట్టుబడులు, ఐటీ చెల్లింపులపై ఐటీ శాఖ వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమా పెట్టుబడులపైనా ఆరా తీసినట్లు సమాచారం.