
హైదరాబాద్, వెలుగు: బీరువాల నిండా నోట్ల కట్టలు పేర్చిన ఈ ఫొటో హెటెరో కంపెనీదిగా తెగ వైరల్ అవుతోంది. ట్విటర్ సహా అనేక వెబ్సైట్లలోనూ ఈ ఫొటో హల్చల్ చేస్తోంది. హైదరాబాద్ ఫార్మా కంపెనీ హెటెరోపై ఇటీవలే ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులలో రూ. 555 కోట్ల బ్లాక్మనీ దొరికిందని ఐటీ డిపార్ట్మెంట్ చెప్పడంతోపాటు, రూ. 142 కోట్ల క్యాష్ కూడా అందులో ఉందని ప్రకటించింది. తాజా ఫొటో ఆ డబ్బుదేనని పేర్కొంటూ వైరల్ చేస్తున్నారు.