
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన 'ఆఫ్-క్యాంపస్ డిజిటల్ హైరింగ్' ప్రోగ్రామ్ కోసం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25. కేండిడేట్లు ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూకు రావాలి. టీసీఎస్ నోటిఫికేషన్ ప్రకారం, అండర్ గ్రాడ్యుయేట్‌లు సంవత్సరానికి రూ.7 లక్షలు ప్యాకేజీ పొందుతారు. పదో తరగతి, 12వ తరగతి, డిప్లొమా (వర్తిస్తే), గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ పరీక్షలో కనీసం (అన్ని సెమిస్టర్‌లలోని అన్ని సబ్జెక్టులు) 70శాతం లేదా 7 సీజీపీఏ మార్కులు రావాలి.కేండిడేట్లకు ఐటీ పరిశ్రమలో కనీసం 6-–12 నెలల అనుభవం ఉండాలి. చదువులో ఏవైనా గ్యాప్స్ ఏవైనా ఉంటే తప్పనిసరిగా ప్రకటించాలి. అకడమిక్ గ్యాప్ 24 నెలలు మించకూడదు. ఫుల్ టైం కోర్సులను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. పార్ట్ టైమ్/కరస్పాండెన్స్ కోర్సులు చేసిన వారు ఎలిజబుల్ కాదు. కేండిడేట్లు టీసీఎస్ వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించాలి. తర్వాత 'డిజిటల్ డ్రైవ్'పై క్లిక్ చేసి ప్రాసెస్‌ను పూర్తి చేయాలి.