ఒకేసారి రెండు, మూడు చోట్ల వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్

ఒకేసారి రెండు, మూడు చోట్ల వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్
  • ఒకేసారి రెండు, మూడు చోట్ల వర్క్ చేస్తున్న సాఫ్ట్​వేర్ ఎంప్లాయీస్
  • టర్మినెట్ చేస్తామని మేనేజ్​మెంట్ల హెచ్చరికలు

హైదరాబాద్, వెలుగు: దాదాపు రెండేళ్ల నుంచి ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే కొనసాగుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఆఫీసును మొదలుపెట్టినప్పటికీ ఎక్కువ మంది ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని కంపెనీల్లో మూడ్రోజులు ఆఫీసు, రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో హైబ్రిడ్ విధానం నడుస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఒకటికి మించి ఉద్యోగాలు చేయడం మొదలు పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ కంపెనీతో మిగతా టైమ్ వేరే కంపెనీలలో పార్ట్‌‌‌‌‌‌‌‌ టైం, ఫుల్ టైం జాబ్ లు చేయడం ప్రారంభించారు. ఇలా మూన్ లైట్​ పద్ధతిలో ఉద్యోగాలు చేయడాన్ని మేనేజ్​మెంట్లు  సీరియస్​గా తీసుకుంటున్నాయి. కంపెనీ టర్మ్స్ అండ్ కండీషన్స్ వ్యతిరేకిస్తే జాబ్స్ నుంచి టర్మినెట్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నాయి. ఏడాదిగా ఈ విధంగా కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం కంపెనీలు వీటిపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ విధంగా డబుల్ శాలరీ ఉద్యోగాలు చేస్తున్నట్లు గుర్తిస్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని ఎంప్లాయీస్​కు మెయిల్స్, మెసేజ్​లు పెడుతున్నాయి. హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్​లు కూడా టీం లీడర్లకు, మేనేజర్లకు వీటిపై ఫోకస్ పెట్టాలని చెప్తున్నారు. 

డబుల్ ఇన్‌‌‌‌‌‌‌‌కం కోసం.. 

కొన్ని కంపెనీలకు చెందిన చాలామంది ఎంప్లాయీస్ ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉన్నారు. సాయంత్రం ఆఫీసు వర్క్ అయిపోగానే  డబుల్ ఇన్‌‌‌‌‌‌‌‌కం కోసం ఇంకో కంపెనీకి సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. ఇలా ఉదయం, రాత్రి పనిచేస్తున్నారు. మరికొంతమంది  వేరే కంపెనీల్లో సెకెండ్ జాబ్​లో జాయిన్​ అవుతున్నారు. కంపెనీ రూల్స్ ప్రకారం వారి రిక్రూట్​మెంట్​ఫామ్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అవుతున్న కంపెనీలో మాత్రమే పని చేయాలని రాసి ఉంటుంది. ఉద్యోగ ఒప్పందం ప్రకారం ఒకేసారి రెండు చోట్ల పని చేయకూడదని రూల్స్ ఉంటాయి.  చాలామంది ఎంప్లాయీస్ వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఇతర కంపెనీల్లో జాబ్ లు చేస్తున్నారు. 

ఎంప్లాయీస్​కు వార్నింగ్ ..

తమ సంస్థల్లో జాబ్ చేస్తూ మిగతా సమయాల్లో ఇతర కంపెనీల ఎంప్లాయ్​గా కొనసాగడాన్ని ఐటీ కంపెనీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఈ మూన్ లైట్​ పద్ధతిలో అక్కడా, ఇక్కడా పని చేస్తే జాబ్ నుంచి పర్మినెంట్​గా తీసేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఎంఎన్‌‌‌‌‌‌‌‌సీలు ఇన్ఫోసిస్, విప్రో  వీటిపై ఎంప్లాయీస్​కు మెయిల్స్ పాస్ చేశాయి. ఇటీవల ఐబీఎం కూడా ఈ పద్ధతిపై ఎంప్లా
యీస్​ను హెచ్చరించింది.  గతంలోనూ ఒక్కరే నాలుగైదు కంపెనీల్లో ఎంప్లాయ్​గా వ్యవహరించిన ఘటనలు బయటికి వచ్చాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా కొనసాగుతుండటంతో కంపెనీల మేనేజ్ మెంట్లు దీనిపై మరింతగా ఫోకస్ చేస్తున్నాయి. బడా కంపెనీల బాటలోనే ఇతర సంస్థలు కూడా నడుస్తున్నాయి. తమ ఎంప్లాయీస్​కు హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా మెయిల్స్ పంపిస్తున్నాయి.

ఒకేసారి రెండు కంపెనీల్లో పనిచేయొద్దన్నరు

కొన్నిరోజులు మూన్ లైట్​ పద్ధతిలో పనిచేసే ఎంప్లాయీస్​పై మా ఆఫీసులో డిస్కషన్ జరుగుతోంది. మీటింగ్స్‌‌‌‌‌‌‌‌లోనూ ఈ టాపిక్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు టీం లీడర్స్, మేనేజర్స్ దీని గురించి మాకు చెప్పారు. ఏ ఎంప్లాయ్ అయినా కంపెనీ రూల్స్ కు వ్యతిరేకంగా వేరే చోట జాబ్ చేస్తే వెంటనే యాక్షన్ ఉంటుందన్నారు.  దీనిపై కంపెనీ నుంచి మాకు అఫిషియల్ మెయిల్ కూడా వచ్చింది. అందులో ఎంప్లాయీస్​ను టర్మినెట్ చేస్తామని చెప్పారు. 

- మానస, ఐటీ ఎంప్లాయ్, కూకట్ పల్లి

వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్టయ్యాకే ఎక్కువగా..

కరోనా నుంచి చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్‌‌‌‌‌‌‌‌ హోమ్ పద్ధతిలోనే నడు స్తున్నాయి. ఎంప్లాయీస్​ను ప్రెజర్ చేయకుండా వారి ఇష్టానుసారంగా వర్క్ చేయొచ్చని చాలా కంపెనీలు హామీ ఇచ్చాయి. అలాగే కొనసాగిస్తున్నాయి. ఈ  లీజర్ టైమ్​ను ఎంప్లాయీస్ డబుల్ శాలరీ కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఇదివరకు కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగాయి. కానీ ఈ మధ్య ఎక్కువయ్యాయి. దీనిపై ప్రస్తుతం అన్ని కంపెనీలు చాలా సీరియస్​గా ఫోకస్ చేస్తున్నాయి. ఎంప్లాయీస్ ప్రొఫైల్స్ చెక్ చేయిస్తున్నాయి. 

- శ్రీధర్ మెరుగు, ఫౌండర్, ఐటీ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ ఫోరమ్