నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ కేపీహెచ్‌బీలోని మర్రి జనార్ధన్ రెడ్డి నివాసంలో జూన్ 14వ తేదీ ఉదయం ఉదయం నుండి ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. జేసీ బ్రదర్స్ లో జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
మర్రి జనార్థన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుండి జేసీ బ్రదర్స్ బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన జేసీ బ్రదర్స్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. జేసీ బ్రదర్స్ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలను మర్రి జనార్ధన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ తో పాటు..తెలంగాణలోని పలు పట్టణాల్లో జేసీ బ్రదర్స్ బట్టల షోరూమ్ లు ఉన్నాయి.
