
న్యూఢిల్లీ : ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ తన వద్ద ఉండే పాన్ సహా ఇతర వివరాలను సెబీతో పంచుకోనుంది. స్టాక్ మార్కెట్లో మేనిప్యులేషన్స్‌కు పాల్పడే కంపెనీలు, వ్యక్తుల పని పట్టేందుకు ఈ వివరాలు సాయపడతాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఒక ఆర్డరును జారీ చేసింది.
ఏదైనా కంపెనీ, వ్యక్తి పాన్ వివరాలను సెబీ కోరితే ఇవ్వడంతోపాటు, తనంతట తానుగా కూడా ఐటీ డిపార్ట్‌మెంట్ కొందరి వివరాలను సెబీకి ఇవ్వచ్చు. అంతేకాకుండా, ఆటోమేటిక్‌గా పాన్ వివరాలు సెబీకి అందుబాటులోనూ ఉంచుతారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకునేందు కోసం సెబీ, సీబీడీటీలు ఎంఓయూ కుదుర్చుకోనున్నాయి.