Malaika Arora: ట్రోల్స్‌కు మలైకా అరోరా స్ట్రాంగ్ కౌంటర్.. ఆ వయసులో డ్యాన్స్ చేస్తే తప్పేంటి?

Malaika Arora: ట్రోల్స్‌కు మలైకా అరోరా స్ట్రాంగ్ కౌంటర్.. ఆ వయసులో డ్యాన్స్ చేస్తే తప్పేంటి?

ఐటమ్ సాంగ్స్ తోనే ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ ఐటమ్ బాంబ్, గ్రామర్ క్వీన్ మలైకా అరోరా . 'ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య.. "మున్నీ బద్నామ్ హుయీ' నుంచి 'అనార్కలీ డిస్కో చాలి" వంటి ఎన్నో ఐకానిక్ పాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది.. ఇటీవల కూడా హనీ సింగ్ తో 'చిల్ గమ్", ఆదిత్య సర్వోదర్ దర్శకత్వంలో వచ్చిన 'కామా'లో రష్మికతో కలిసి "పాయిజన్ బేబీ"తో కిర్రాక్ డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. 

ఈ ముద్దుగుమ్మ వయసు 50 ఏళ్లు దాటినా.. గ్లామర్ డోస్ లో ఏమాత్రం తగ్గడం లేదు. తనదైన శైలిలో డ్యాన్స్ తో మెప్పిస్తోంది మలైకా .  వయసు కేవలం తనకు ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తోంది. విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా తన కెరీర్ లో ముందుకు సాగుతోంది. అయితే తన బటెం సాంగ్స్ పై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్ పై మలైకా తాజాగా ఘాటుగా స్పందించింది. "నేను డ్యాన్స్ చేయడం ఎందుకు తగ్గించుకోవాలి. దాని కోసం సారీ ఎందుకు చెప్పాలి. ట్రోల్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయిని కౌంటర్ ఇచ్చింది.

 డ్యాన్స్ చేయడం గొప్ప విషయం. అదో కళ అని మలైకా చెప్పుకొచ్చింది. నిజమైన గౌరవంతో దాన్ని ఆస్వాదించాలి. 52 ఏండ్ల వయసులో నేను ఇలాంటి పాటల్లో హుషారుగా డ్యాన్స్ చేయగలుగుతున్నానంటే అది నా అదృష్టం. నేను సరైన మార్గంలోనే ఉన్నానని భావిస్తున్న ఐటెం సాంగ్స్ లో నటించడం నాకు చాలా శక్తినిస్తుంది. అద్భుతంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. నా పని చూసి ఇతర మహిళలు స్పూర్తి పొందితే, దానిని మించిన సంతృప్తి ఉండదు అని తెలిపింది. ఈ బాలీవుడ్ భామ. ప్రస్తుతం మలైకా వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.