పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చిన పర్వాలేదు : సీపీ సుధీర్ బాబు

పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చిన పర్వాలేదు : సీపీ సుధీర్ బాబు

పిల్లలు క్రీడల్లో తప్పకుండా పాల్గొనాలని రాచకొండ సీపీ జీ. సుధీర్ బాబు అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పని ఒత్తిడిలో ఉన్న సిబ్బందికి ఈ స్పోర్ట్స్ మీట్ తో రిలీఫ్ అయ్యి మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. తల్లితండ్రులకు తాను చెప్పేది ఒక్కటేనని పరీక్షల్లో 5 మార్కులు తక్కువ వచ్చిన పర్వాలేదు కానీ పిల్లలు తప్పకుండా క్రీడలలో పాల్గొనేట్టు చూడాలని తెలిపారు. 

ఈ స్పోర్ట్స్ మీట్ లో మొత్తం 8టీంలు పాల్గొంటున్నాయని సీపీ తెలిపారు. నిత్యం ఉద్యోగ పని ఒత్తిడిలోనే ఉంటున్నాం కాబట్టి క్రీడలు మానసిక వికాసాన్ని ఉల్లాసాన్ని కల్పిస్తాయని చెప్పారు. తమ డిపార్ట్మెంట్ లో కూడా ఎంతో మంది టాలెంట్ ఉన్నవాళ్లు ఉన్నారని తెలిపారు.  వారిలో ఉన్న కళను బయటకు తీసేందుకు ఈ స్పోర్ట్స మీట్ ఉపయోగపడుతుందని చెప్పారు. హెల్తీ ఇండియా హెల్తీ తెలంగాణ కావాలంటే స్పోర్ట్స్ ఎంతో ముఖ్యమని సీపీ జీ. సుధీర్ బాబు అన్నారు.